నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 27 : మదనపల్లి పట్టణం అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎం.బి.ఏ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వెంకట రావ్ వల్లూరి కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమండ్రి లోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపిక చేసిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల చెడు రుణాల (NPAలు) పోలిక అధ్యయనం) అనే అంశంపై శ్రీ యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల, నరసాపూర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం నందు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి.హెచ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన పరిశోధనకు గాను ఈ పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా పీహెచ్‌డీ పట్టా పొందిన వెంకట రావ్ వల్లూరి ను మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్, డీన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు
Reporter
Namitha News