నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 27 : అన్నమయ్య జిల్లా మండలపరిషత్ కార్యాలయంలో బుధవారం వైస్ ఎంపిపి రమణా రెడ్డి, ఎంపిడిఓ లతీఫ్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. పైనే మండలంలోని స్తానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో అకాల మరణం చెందిన ఎంపిపి కుసుమకుమారి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించి సభను ప్రారంభించారు. ఈసమావేశంలో ముఖ్య అతిదిగా వైస్ ఎంపిపి రమణా రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు రాజకీయాలు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నారు.అభివృద్ధిపథంలో మండలం ముందుండాలన్నారు. వ్యవసాయ శాఖ ఎఒ జాఫర్ తో మాట్లాడుతూ రబీ సీజన్ లో వేరు శెనగ కాయలురైతులు తక్కువగా వేశారని దాని ప్రత్యాన్నంగా ఈ సీజన్ లో రైతులకు నారాయణ అనే కొత్త రకం సీడ్ వేరు శెనగకాయలు మండలానికి మంజూరు అయ్యాయని వాటి దిగుబడి అధికంగా దిగుబడి వస్తుందన్నారు. రైతులకు జిప్సం కోరమండల్ కంపెనీ వారి సహాయంతో రైతులకు సబ్సిడీ తో పంపిణీ చేస్తామన్నారు. రైతులకు సబ్సిడీ తో డ్రోన్ లు పంపిణీ చేస్తామని కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించండన్నారు .విద్యుత్ శాఖ ఏ ఈ మస్తాన్ వల్లి మాట్లాడుతూ రైతులకు నాన్యత మైన విద్యుత్ అందిస్తామని గత వారం కేసీ పల్లెలో ఎమ్మెల్యే షాజాహాన్ బాషా చేతులు మీదుగా పవర్ మిషన్ లు ప్రారంభించారని, ఆర్ నడింపల్లె సబ్ స్టేషన్, చెంబకూరు సబ్ స్టేషన్ లలో పవర్ ట్రాన్స్ఫర్మర్స్ ప్రారంభించామని, రైతులకు సకాలంలో కొత్త ట్రాన్ఫార్మర్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. విద్య పై ఎం ఈవో హేమలత, ఆంజనేయులు మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మండలంలో 82శాతంతో ఉత్త్తీర్ణత అయ్యారని ఈ సంవత్సరం అధిక శాతం ఉత్త్తీర్ణత సాధిస్తామన్నారు. వైద్య దికారులు మాట్లాడుతూ మండలంలో ఎవ్వరైనా లెప్రసి, క్యాన్సర్ లక్ష్మణాలు కలిగిఉంటే డాక్టర్లను సంప్రదించ్చాలన్నారు. మా సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు.ఈ సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపిపి రమణారెడ్డి ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్,ఏ ఈ మస్తాన్ వల్లి, విద్యాశాఖ అధికారి హేమలత,ఆంజనేయులు ఎపిఒ మాదవి, ఏ ఓ జాఫర్, సర్పంచ్ లు రెడ్డెప్పనాయుడు,కొండూరు శ్రీనాథ్ రెడ్డి,జమున సుబ్బారెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి, బాలప్ప,సు భాష్ ,ఎంపిటీసీ లు. రమణారెడ్డి,మస్తాన్, రెడ్డిశేఖర్, పంచాయతీ సెక్రటరీ లు,వైద్య సిబ్బంది,ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మండల ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News