Saturday, 12 September 2026 04:41:29 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

Date : 21 April 2026 06:19 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అంస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ కి వెంటనే జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, పట్టణ కన్వీనర్ రామకృష్ణ లు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో ఉదయం 5 గంటలకే విధుల్లోకి వచ్చి వీధులను, కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ, చెత్త చెదారాన్ని ఎత్తేస్తూ పారిశుద్ధ్య మెరుగుకు ఎంతో పని చేస్తున్నామన్నారు‌ తమకు చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టికొస్తున్నామని, కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా నెలలు తరబడి బకాయిలు పెట్టడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరంగా మారిందన్నారు. మార్చి నెల జీతం ఏప్రిల్ 21వ తేదీ అవుతున్నా ఇవ్వకపోవడంతో తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమకు కడుపు మండినందునే ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తమ జీతాలను వెంటనే విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, రామచంద్ర, కృష్ణప్ప, రాజు, మంజుల, శివమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :