Monday, 14 September 2026 12:18:35 AM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గొల్లపల్లి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టైల పంపిణి

Date : 10 November 2025 06:55 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండలం గొల్లపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాల లోని 55 మంది విద్యార్థులకు సోమవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మరియు పాఠశాల కమిటీ సభ్యుడు పురుషోత్తం సంయుక్తంగా స్వంత నిధులతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, టైలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలకు మరియు ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, కమిటీ సభ్యుల సహకారం ఎంతైనా అవసరమని, ఈ పాఠశాలలోని పిల్లల అభివృద్ధి బాగుందని ఉపాధ్యాయులను కొనియాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ గొల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షాహిరా ,చోకాండ్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గొల్లపల్లి ఉపాధ్యాయురాలు రెడ్డినీలాంబ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగభూషణం, సభ్యులు అమరప్ప, సుజ్ఞానమూర్తి, చస్మా, ఉపాధ్యాయులు చిన్న రెడ్డప్ప , రామన్న తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :