Monday, 14 September 2026 08:01:01 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నేషనల్ లెవెల్ అడ్వెంచర్ & మౌంటెనీరింగ్ క్యాంప్‌ లో పాల్గొన్న మిట్స్ యూనివర్సిటీ యన్.సి.సి. క్యాడెట్

Date : 25 December 2025 07:26 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, యన్.సి.సి క్యాడెట్ ఆర్.లాస్య ప్రియ, ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ అఫ్ మౌంటెనీరింగ్ శిక్షణా కేంద్రం నిర్వహించిన నేషనల్ లెవెల్ అడ్వెంచర్ మరియు మౌంటెనీరింగ్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు. ఈ శిక్షణలో దేశ నలుమూలల నుండి 400 మందికి పైగా క్యాడెట్స్ పాల్గొనగా, అందులో మిట్స్ విద్యార్థిని పాల్గొనడం గర్వకారణం అని అన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో యెన్.సి.సి క్యాడెట్లకు పర్వతారోహణ,రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్ వంటి కఠిన శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రకృతి సవాళ్ళను ఎదుర్కుంటూ జట్టు భావనతో పని చేయడం, దేశ సేవకు సిద్దమవడం వంటి విలువలు పెంపొందుతాయని అన్నారు. ప్రతి క్యాడెట్ కూడా తమ వంతు దేశ రక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరము యెన్.సి.సి క్యాడెట్స్ తమ యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకువస్తున్నారని, ఇది ఇలాగె కొనసాగాలని ప్రతి క్యాడెట్ ప్రతి క్యాంపు కు వెళ్లాలని ఆయన అన్నారు.శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన క్యాడెట్ లాస్య ప్రియ ను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ఎన్. నవీన్ కుమార్, 35 ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ మోనిష్. యెన్.వి, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ లెఫ్టనెంట్ కల్నల్ పీ. లోకనాథన్ మరియు తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్ర దయా తదితరులు అభినందనలు తెలియజేసారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :