నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -ఆగస్టు 23 : తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి(బాలిరెడ్డి గారిపల్లి) పంచాయతీకి సెల్ టవర్ లేక అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై కూటమి నాయకులు కృషి ఫలితంతో బిఎస్ఎన్ఎల్ టవర్ మంజూరు అయింది. సచివాలయ సమీపంలో టవర్ నిర్మాణానికి ఐదు మంది దాతలు ముందుకు రావడం స్థానిక ప్రజలు, నాయకులు, అధికారులు వారిని అభినందనలతో ముంచెత్తారు. సోమవారం సెల్ టవర్కు భూదాతలు బి.యుగంధర్ రెడ్డి, బి.వెంకట్ రెడ్డి,బి. కుమారస్వామిరెడ్డి, బి.బాబురెడ్డి,బి. ప్రమీలమ్మ లు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తాసిల్దార్ శ్రీనివాసులకు అందజేశారు. తాసిల్దార్ భూ దాతలను ప్రత్యేకంగా అభినందించి ప్రజల సౌకర్యార్థం సెల్ టవర్ నిర్మాణానికి సహకరించిన భూ దాతలు ఆదర్శప్రాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీఆర్వో సలీం భాష, బాలిరెడ్డి గారిపల్లె గ్రామస్తులు పాల్గొన్నారు
Reporter
Namitha News