నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 10 : కూటమి ప్రభుత్వం మొన్న విడుదల చేసిన నేతన్న భరోసా ను, అర్హులైన కొంతమందివి మంజూరు చేయకుండా, అనర్హులకు మంజూరు చేసిన జౌళిశాఖ ఏడి పై విచారణ చేసి సస్పెండ్ చేయాలని, సచివాలయంలో గోల్ మాల్ కు పాల్పడ్డవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన చేనేతలకు మద్దత్తు గా సిపిఐ నాయకులు పాల్గొని చేనేతలకు న్యాయం చేయాలంటూ, అనర్హులను ఎంపిక చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళన లో చేనేతలు, సిపిఐ నేతలు కృష్ణప్ప, మురళి, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News