నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 14 : భారతదేశానికి రాజ్యాంగం అందించి అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడని తాసిల్దార్ శ్రీనివాసులు కొనియాడారు. మంగళవారం వీఆర్వోల సంఘం అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేర్ రామకృష్ణ, వీఆర్వోలు, వీఆర్ఏలు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News