నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు అంతరిక్ష కేంద్రంలోని రాకెట్ లాంచ్ బేస్ స్టేషన్‌ల కోసం రేంజ్ సిస్టమ్స్ అనే అంశంపై ఒక్క రోజు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతదేశ ఇస్రో మాజీ శాస్త్రవేత్త, కిస్సెట్ (QISCET) డైరెక్టర్, భారత అంతరిక్ష విభాగానికి చెందిన ఇన్ స్పేస్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ బి. వి. సుబ్బారావు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాకెట్ ప్రయోగ సమయంలో దాని దూరం, దిశ, కదలికలను గుర్తించే రేంజ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో విద్యార్థులకు వివరించారు. రాకెట్ ప్రయాణాన్ని నిరంతరం గమనించి అవసరమైన సమాచారాన్ని లాంచ్ బేస్ స్టేషన్‌కు పంపించి, రాకెట్ నిర్ణయించిన మార్గంలోనే వెళ్తుందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఈ వ్యవస్థలు ఉపయాగపడతాయని తెలిపారు. ఏదైనా లోపం వచ్చినప్పుడు వెంటనే గుర్తించి ప్రమాదాలను నివారించడంలో ఇవి సహాయపడతాయి అని అన్నారు. అంతేకాకుండా రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయ్యేందుకు, ఉపగ్రహాన్ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రేంజ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషితాయని తెలిపారు. అలాగే ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధిలో భాగమైన వివిధ సబ్-సిస్టమ్స్ గురించి అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఇస్రో సంస్థ గౌరవం తీసుకొచ్చింది అని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇస్రో, నాసా వంటి అంతర్జాతీయ పరిశోధనా సంస్థలలో ఆధునిక టెక్నాలిజీలపై అవగాహన పెంచుకొని, ఈ సంస్థలు అందిస్తున్న ఇంటర్న్ షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ తో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ విభాగాలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నిద్యా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News