Saturday, 12 September 2026 12:07:30 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం

Date : 11 September 2026 08:23 AM Views : 81

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 10 : వి బి జి రాంజీ ఉపాధి పనులలో భాగంగా కూలీలు చేపట్టిన నీటి సంరక్షణ లో సప్లై ఛానల్ పనులు ఆదర్శవంతంగా నిలుస్తాయని అన్నమయ్య జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ప్రశంసించారు. గురువారం మండలంలోని కోటకొండ లో విబిజి రామ్జీ ఉపాధి పనులలో భాగంగా చేపట్టిన చెరువు సప్లై ఛానల్ పనులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి పనులలో ప్రతి చెరువులో సప్లై చానల్స్ పనులు చేపట్టి ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా నీటి సంరక్షణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల పరిధిలోని సప్లై చానల్స్ పనులు చేపట్టి భవిష్యత్తులో నీటి సంరక్షణ ధ్యేయంగా పనులు చేయాలన్నారు. అదేవిధంగా పండ్ల తోటల పెంపకం తో నీటి ఆదాతో పాటు అధిక దిగుబడులకు రైతులకు సహకరించాలన్నారు. చెరువుల్లో ఫారం పాండ్స్ నిర్మాణాలపై దృష్టి సారించి పశుగ్రాస కొరత తీర్చడానికి పాడి రైతులకు పశుగ్రాస పెంపకానికి రైతులను ప్రోత్సహించాలన్నారు. వి బి జి రాంజీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ఆయన వెంట ఏ పి ఓ అంజనప్ప, ఎంటిసీ లక్ష్మీనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీదేవి ఉపాధి కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :