Sunday, 13 September 2026 07:45:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మూడు నెలలకు ఒకసారి నీళ్లు - తీవ్ర ఇబ్బందులు

Date : 14 June 2026 02:59 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 14: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోళ్ల బైలు 1 స్వర్ణ గ్రామ పంచాయతీ లోని నెలకొన్న మౌలిక సమస్యలైన మంచినీరు రోడ్లు కాలువలు వీధిలైట్లు పారిశుద్ధ్య వంటి సమస్యను పరిష్కరించాలని కోళ్ల బైలు శివాలయం వీధి ఇందిరమ్మ కాలనీ వాసులు కాలనీలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ అలాగే వీధిలైట్లు మురికి కాలువలు పెండింగ్ లో ఉన్న రోడ్లు మరమ్మతులు నూతన రోడ్లు సిసి రోడ్లు వేయాలని పారిశుధ్యం కోళ్ల బైలు 1 కాలనీలో వీధి కుల్లాయి లకు నీటి సరఫరా మూడు నెలలకు ఓసారి జరుగుతున్నదని ఈ సమస్య పైన పలుమార్లు పంచాయతీ కార్యదర్శి తో స్పెషలాఫీసర్ తో ఎంపీడీవో తో మాట్లాడడం జరిగిందని ఫిర్యాదులు చేయడం జరిగిందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యమని ఇక్కడ నీళ్లు వదులుతున్న షహీనా అనే మహిళ ప్రజల పట్ల అవాకులు చవాకులు అవహేళనగా వ్యవహరిస్తుందని ఆమెను తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడు లేడని వాపోయారు ఈ పంచాయతీకి సంబంధించి నీటి ట్యాంకర్లు ఉన్నా కూడా నీటి సమస్య బర్నింగ్ సమస్యగా ఉన్న పేదలు తమ కూలి డబ్బులు సగానికి పైన నీటికే ఖర్చు చేయవలసిన పరిస్థితి దూపరించిందని నీటి సమస్యపై యుద్ధ ప్రాతిపదికన నీటి ట్యాంకర్లతో ఇంటింటికి నీటిని సరఫరా చేయాల్సింది పోయి పంచాయతీలో ఉన్న మూడు నాలుగు ట్యాంకర్లను అధికారుల ఇండ్లకు తోలుతూ మిగిలిన సమయంలో మున్సిపాలిటీకి డబ్బులకు నీటిని ట్యాంకర్ తో సంపులకు తోలుతున్నారని ఈ అక్రమాలపై విచారణ చేపట్టాలని పంచాయతీలో ఉన్న నిధులు ప్రజలకు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం ధోరణి వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం ఖాళీ బిందెలతో బిందెతో కోళ్ల బైలు కాలనీలో ధర్నా కార్యక్రమ చేపట్టడం జరిగింది పంచాయతీ వ్యవస్థ పంచాయతుల అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని దుర్మార్గపు పరిస్థితులు పంచాయతీ వ్యవస్థ ఉన్నదని ప్రభుత్వాలు స్వర్ణ పంచాయితీ అని ప్రజల్ బాలు పలుకుతూ మౌలిక సమస్యలు కూడా పరిష్కరించలేని విధంగా ఉన్నారని పంచాయతీలో నివసిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలు తమ విధిగా ఇంటి పన్ను నీటి పన్ను పారిశుద్ధ్యం పన్ను లైబ్రరీ పన్ను చెల్లిస్తున్న కనీస అవసరాలు తీర్చడం లేదని మేము కట్టే డబ్బులు ఎటుపోతున్నాయని వారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కొండయ్య శారదమ్మ భాగ్యమ్మ నారాయణమ్మ షకీలా పురుషోత్తం భవాని పార్వతమ్మ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: