నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 09 : శ్రీనిధి ఆర్థిక లావాదేవీలలో రాష్ట్రంలోని ఏడు జోనల్ పరిధిలో కడప జోన్ ప్రథమ స్థాయిలో నిలవడానికి అందరి సమిష్టి కృషి ఉందని శ్రీనిధి డీజీఎం వెంకట ప్రకాష్ కొనియాడారు. గురువారం ఆయన ఏజీఎం సంతోష్ కుమార్ తో కలిసి ఐకెపి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని శ్రీనిధి రుణాల పంపిణీ, రికవరీలపై ఆరా తీసి వంద శాతం రికవరీ సాధించడం పై ఏపిఎం గంగాధర్, శ్రీనిధి మేనేజర్ అమరావతి,సి.సిలు,సంఘమిత్రలను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో శ్రీనిధి ఆర్థిక లావాదేవీలు ఆన్లైన్లో జరుగుతున్నాయని దానికి సంబంధించి సంబంధిత యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయన్నారు. దీనివల్ల నిధులు దుర్వినియోగం లేకుండా నేరుగా లబ్ధిదారుల తో ఆర్థిక లావాదేవీలు నడుస్తాయన్నారు.ఈ ఆర్థిక ఏడాదికి అన్నమయ్య జిల్లాకు 508.12 కోట్లు, సత్య సాయి జిల్లాకు 492 కోట్లు, కడప జిల్లాకు 495 కోట్లు శ్రీనిధి నిధుల రుణాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. తంబళ్లపల్లె సెక్టార్ లోని తంబళ్లపల్లె, పెద్దమండెం, కురబలకోట మండలాలకు 13.36 కోట్లు లక్ష్యంగా ఎంచుకొని నిధులు కేటాయించినట్లు చెప్పారు. శ్రీనిధి రుణాలు పంపిణీలోఈ ఏడాది ఐదు లక్షల వరకు రుణ పంపిణీకి వెసులుబాటు కల్పిస్తున్నామని శ్రీనిధి రుణాలు లబ్ధిదారులు మినీ పరిశ్రమలు, వ్యాపారాలు, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఏపిఎం గంగాధర్ కు సూచించారు. శ్రీనిధి లబ్ధిదారులకు 11 శాతం వడ్డీ తో రుణం ఇవ్వడంతో పాటు ఆ వడ్డీలో రుణాలు పొందిన మండల సమైక్య లకు ప్రోత్సాహక నిధులు చెల్లిస్తున్నామని గతంలో వివోలకు 1.67 చెల్లించినట్లు చెప్పారు. శ్రీనిధి ద్వారా నేటి మహిళా సంఘాలు దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో శ్రీనిధి ఓబ్యాంకు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. శ్రీనిధి నిధుల ఆర్థిక లావాదేవీలలో ఐకెపి ఇస్తున్న సహకారం రెట్టింపు చేసి మహిళల ఆర్థిక అభివృద్ధి సాధనలో కృషి చేయాలని సూచించారు. శ్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు నిధులు ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకుని సకాలంలో తిరిగి చెల్లించి మీ కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదగడానికి ముందుకు రావాలన్నారు. వారి వెంట సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, వివో సభ్యులు పాల్గొన్నారు
Reporter
Namitha News