Saturday, 12 September 2026 07:20:08 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు

Date : 06 June 2026 04:42 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *ప్రభుత్వ విద్యను పరిరక్షించుకుందాం* *విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు* *నీట్ ప్రశ్నాపత్రం లీకుకు సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి* *ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు* అన్నమయ్య జిల్లా : ప్రభుత్వ విద్యను పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణంలో జరుగుతున్నటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ సైదాంతిక శిక్షణ తరగతులను ముందుగా ఏఐఎస్ఎఫ్ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్ గారు ఆవిష్కరించారు. అనంతరం ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు ఊడిగం చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ పూర్తిగా విద్యారంగాన్ని వ్యాపారం చేసేసారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ నుండి పీజీ వరకు అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఫీజు బుక్స్ , టై, షూ, బెల్ట్ , దోబి ప్యాకెట్ మనీ వంటి ఫీజులతో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షలాది రూపాయలను వసూలు చేసి వారి యొక్క రక్తాన్ని జలగల్ల పిలుస్తూ అర్హత లేని ఉపాధ్యాయులచే విద్యాబోధన చేపిస్తూ విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని తీసుకువచ్చి ఆత్మహత్యలకు పాలపడే విధంగా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను అందలం ఎక్కించే భాగంలోనే నీట్ ప్రవేశ పరీక్షను ఎన్టిఏ లాంటి ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం వలన ఇప్పటికీ మూడుసార్లు నీట్ ప్రవేశ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం జరిగిందనీ దీని వలన ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడిండి అని అన్నారు. దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల పాటు లక్షలాది రూపాయలు కట్టి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని నీట్ ప్రైవేట్ పరీక్షకు సిద్ధమైతే ఇప్పుడు లీక్ అయిందని ప్రశ్నాపత్రాన్ని రద్దు చేస్తే ఇప్పుడు ఆ విద్యార్థుల యొక్క సమయం , వ్యయం వారి యొక్క భవిష్యత్తుకు వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ మంత్రి కానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని వారు ప్రశ్నించారు. వెంటనే నీట్ ప్రవేశ పరీక్ష పత్రం లీకుకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు . అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితి చాలా ధననీయంగా మారిందని యూనివర్సిటీకి నిధులు లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయక యూనివర్సిటీలలో మూఢనమ్మకాలను ప్రేరేపిస్తూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ యూనివర్సిటీల ఖ్యాతిని రోజు రోజుకు పూర్తిగా దిగజారుస్తున్నారని వారు మండిపడ్డారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాల ద్వారానే విద్యార్థులలో వారి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వ విద్యను పరిరక్షించుకుంటామని ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడిని అడ్డుకుంటామని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో ప్రజా సంఘాల నిర్మాణం- కర్తవ్యాలు, మార్క్స్ ,ఎంగిల్స్, లెనిన్ , చేగువేరా- జీవితాలు, భారత దేశ చరిత్ర- సంస్కృతి , సమాజ పరిమాణ క్రమం లాంటి అంశాలపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు , ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు ఎంవి రమణ, క్షేత్ర పాల్, జనార్దన్లు, బోధించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి .మహేష్ , సహాయ కార్యదర్శి కృష్ణప్ప, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్ ,మాధవ్, చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రవీణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి, డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు టిఎల్ వెంకటేష్ ఏఐఎస్ఎఫ్ గర్ల్స్ కన్వీనర్ గంగారాని, కోకన్వీనర్ నవ్య తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: