నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 05 : విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరడానికి ఆది గురువు ఉపాధ్యాయుడేనని ఎంఈఓ నాగ సుబ్బరాయుడు కొనియాడారు. శనివారం తంబళ్లపల్లె మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ప్రభుత్వాలు సైతం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమని విద్యార్థులకు సకల సౌకర్యాలు ఏర్పాటు జరుగుతుండడంతో విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందని ప్రతి విద్యార్థిని సమానంగా విద్యలో ప్రతిభ కనబరచడానికి వారిలో చైతన్యం నింపాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు, ఎంఆర్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News