Saturday, 12 September 2026 08:10:03 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

గోడ ప‌త్రిక‌ను, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించిన‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Date : 13 January 2026 11:49 AM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమ‌రావ‌తి, జ‌న‌వ‌రి 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆపారమైన పశు సంపదకు నిలయం అని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, పశుసంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన‌ గోడ ప‌త్రిక‌ను, క‌ర‌ప‌త్రాల‌ను సోమ‌వారం విజ‌య‌వాడ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పుంగనూరు గోజాతులు, శ్రేష్ఠమైన నెల్లూరు, మాచెర్ల గొర్రెల జాతులు, అలాగే ఆశిల్ జాతి కోళ్లు మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధన రంగం కొనసాగుతూ, ఈ రంగంపై ఆధారపడిన వారికి ప్రధాన జీవనాధారంగా మారిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108.19 లక్షల ఆవులు & గేదెలు, 231.49 లక్షల గొర్రెలు&మేకలు (దేశంలో 2వ స్థానం), 1078.63 లక్షల కోళ్లు (దేశంలో 2వ స్థానం) ఉన్నాయని తెలిపారు. కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2025 సంవత్సరంలో పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపు మరియు శాస్త్రీయ పశుపోషణపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని 13,257 గ్రామాలలో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ శిబిరాల ద్వారా 10,48,980 పశువులకు పశువైద్య సేవలు అందించడంతో పాటు 5,36,387 మంది పశుపోషకులు లబ్ది పొందారని పేర్కొన్నారు. అదే స్పూర్తితో ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాలలో ముఖ్యంగా పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ (గొర్రెలు, మేకలకు సంవత్సరానికి 4 సార్లు, పెద్ద పశువులకు 2 సార్లు), వ్యాధి నిరోధక టీకాలు, పశువ్యాధుల నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని పశుపోషకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా శిబిరాలను నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ డైరెక్ట‌ర్ డా. దామోద‌ర్ నాయుడు, డిప్యూటీ డైరెక్ట‌ర్ డా. ప్ర‌సాద‌రావు, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ డా. సాయి గోపాల్, అసిస్టెంట్ స‌ర్జ‌న్ డా. ముర‌ళీ మోహ‌న్, త‌దిత‌రులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: