నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 08 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండలో మహాశివరాత్రికి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యాలు, తదితర ఏర్పాట్లపై ఎస్సై అనిల్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహాశివరాత్రి రోజున వచ్చే వేలాదిమంది భక్తులకు రవాణా సౌకర్యం, వాహనాలకు కొండపైన, కొండ కింద పార్కింగ్ ఏర్పాట్లు, కొండపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీశారు. మహాశివరాత్రి పర్వదినాన శివమాల భక్తులు, ప్రజలు తంబాలపల్లి, మదనపల్లె నియోజకవర్గాలతో పాటు కర్ణాటక రాష్ట్రం పరిసర జిల్లాల నుండి వేలాదిగా తరలివచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో పాటు స్థానిక అన్నదాన కమిటీ సభ్యులతో చర్చించారు. మల్లయ్య కొండపై శివరాత్రి రోజున స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు, అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటుచేసిన వాలంటీర్ల వివరాలు మంజూరు చేయాల్సిన పాసులు పై విచారణ చేశారు. మహాశివరాత్రి పర్వదినం భక్తులు సమన్వయం పాటించి స్వామివారిని దర్శించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని ఎస్సై ఓ ప్రకటనలో కోరారు. ఆయన వెంట ఏఎస్ఐ నజీర్ భాష, కానిస్టేబుల్ రాఘవ, అన్నదాన కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు
Reporter
Namitha News