Sunday, 13 September 2026 08:29:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ విద్యార్థులు, అధ్యాపకులు ఇండస్ట్రీ విజట్

Date : 25 April 2026 03:40 PM Views : 230

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఐ.టి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీను సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమలోని ప్రత్యక్ష అనుభవం మరియు ఆధునిక పరిశోధనలపై అవగాహన కల్పించడం ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్శనలో కంపెనీ ప్రతినిధులు ఆశ హొళ్ళ మరియు అఖిల్ విద్యార్థులకు ఏజెంటిక్ ఏ.ఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే అంశాలను సులభంగా వివరించారు. స్వయంచాలకంగా నిర్ణయాలు తీసుకునే ఏ.ఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, వాటిని వాస్తవ జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో తెలియజేశారు. అదేవిధంగా కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహనాత్మక మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు జెనెరేటివ్ ఏ.ఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంపొందించుకుని భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ జెనిఫర్, జె. విశ్వనాథ్ ల అధ్యాపక బృందం మరియు 50 విద్యార్థులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: