Thursday, 30 July 2026 07:29:43 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ లో ఘనంగా అన్యూవల్ డే

28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 లను ఘనంగా నిర్వహించిన విద్యార్థులు

Date : 18 April 2026 08:57 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 18 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు 28వ వార్షిక దినోత్సవ వేడుకలు-2026 ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సందీప్ బడద్ 2025 (UPSC) యూ పిఎస్ సి సివిల్ సర్వీసెస్, 82వ ఆల్ ఇండియా ర్యాంకర్, శ్రీనివాస్ పి.సి, ఫౌండర్ & సి ఈ ఓ, ఇండియా 4IAS అకాడమీ మరియు ప్రశాంత్ శ్రీనివాస్, కో-ఫౌండర్ & డైరెక్టర్, బెంగళూరు,కర్ణాటక పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సల్లర్ యెన్. ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు ముఖ్య అతిధులు సందీప్ బడద్ జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ముఖ్య అతిథి సందీప్ బడద్ మాట్లాడుతూ విద్యార్థి దశలో తన అనుభవాలను పంచుకుంటూ, విజయం ఒక్క రోజులో రాదని, నిరంతర కృషి, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం ఉంటేనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమస్యలను విశ్లేషించే సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనమని అన్నారు. ఈ నైపుణ్యాలు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షల్లో ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కాలేజీ జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు ప్రతిరోజూ కొంత సమయం తమ లక్ష్యాల కోసం కేటాయించాలని, ముఖ్యంగా పత్రికలు చదవడం, ప్రస్తుత అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం, సమాజ సమస్యలపై స్పందన కలిగి ఉండడం చాలా అవసరమని సూచించారు. ఆనందంతో పాటు భవిష్యత్తుపై బాధ్యతతో కూడిన ఆలోచన అవసరమని, పట్టభద్రులైన వెంటనే వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతలు వస్తాయని గుర్తు చేశారు. అందువల్ల కాలేజీ జీవితం ఆస్వాదిస్తూ, తమ కలలను సాధించడానికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అలాగే లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించి తల్లిదండ్రులకు గర్వకారణమవుతారని తెలిపారు. యువతే దేశ భవిష్యత్తు అని గుర్తుంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీ అందించిన నాణ్యమైన విద్య ద్వారా విద్యార్థులు దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో యూనివర్సిటీ యొక్క విద్యా విజయాలు, నియామకాలు మరియు పరిశోధన సహకారాలను హైలైట్ చేస్తూ వార్షిక నివేదికను సమర్పించారు. ఆ తరువాత వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థి అవార్డులు మరియు గుర్తింపులు సాయంత్రం ఉత్సాహాన్ని నింపాయి. కార్యక్రమములో వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: