Sunday, 13 September 2026 11:58:06 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించిన ఎంసిఏ విభాగం సెమినార్

Date : 25 March 2026 09:42 AM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించిన ఎంసిఏ విభాగం సెమినార్. అకాడెమిక్ రైటింగ్, రీసెర్చ్ పేపర్ ప్రిపరేషన్‌పై మార్గదర్శక సదస్సు విజయవంతం మదనపల్లెలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, ఎంసిఏ విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ రైటింగ్ ప్రిపేర్ విత్ పేపర్ ప్రజెంటేషన్ అనే అంశంపై మార్చి 24, 2026 (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు, ఏ బ్లాక్‌లోని సి.వి. రామన్ బ్లాక్, గది నం. 215లో ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఎం. అంజన్ కుమార్, ప్రొఫెసర్ (సిఎస్‌ఇ) మరియు రీసెర్చ్ & డెవలప్మెంట్ డీన్ హాజరై విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందించారు. సెమినార్‌లో ఆయన అకాడెమిక్ రైటింగ్ ప్రాముఖ్యత, రీసెర్చ్ పేపర్ నిర్మాణం (అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెథడాలజీ, ఫలితాలు, ముగింపు), సరైన జర్నల్స్ మరియు కాన్ఫరెన్సుల ఎంపిక, ఇండెక్సింగ్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, ప్లేజరిజం నివారణ, రీసెర్చ్ నైతికత, సైటేషన్ విధానాలు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే, సమర్థవంతమైన రీసెర్చ్ పేపర్ రచనకు అవసరమైన చిట్కాలు, పరిశోధన పత్రాలను ధైర్యంగా ప్రదర్శించే విధానాలపై కూడా సూచనలు అందించారు. ఈ సెమినార్‌లో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఎంసిఏ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అధ్యాపకులు వారికి మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అకాడెమిక్ రైటింగ్‌పై అవగాహన పెరిగి, ప్రెజెంటేషన్ నైపుణ్యాలు మెరుగుపడి, పరిశోధన మరియు ప్రచురణలపై ఆసక్తి పెరిగింది అని ఎంసీఏ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ఉషారాణి మొత్తానికి ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించబడటంతో పాటు విద్యార్థుల అకాడెమిక్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది అని తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :