Thursday, 30 July 2026 12:19:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం - నాగూర్ వల్లి

Date : 21 December 2025 05:11 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి - 14వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయం మదనపల్లె : పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పిలుపునిచ్చారు.14వ వార్డులో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ చిన్నారుల నిండైన జీవితానికి ఏడాదిలో రెండు పర్యాయాలు పోలియో చుక్కలు వేయించాలన్నారు.సమాజంలో పోలియోను సమూలంగా రూపుమాపడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయన్నారు.పోలియో వ్యాధిని సమూలంగా అరికట్టడమే పల్స్ పోలియో లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.14వ వార్డు పరిధిలోని 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగిందన్నారు.ఎవరైనా వేసుకోని పక్షంలో సోమ,మంగళవారంలో ఆయా సచివాలయాల పరిధిలో పోలియో చుక్కలు వేయించుకునే వెసులుబాటు ఉందన్నారు.ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా నియోజకవర్గంలో వైద్యం,విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.సమర్ధవంతమైన పాలనతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డ్ టిడిపి మహిళా లీడర్ నజ్మా సుల్తానా నాయకులు అంగడి కుమార్,వసంత ప్రసాద్,వాసు,ధరణీష్,దిలీప్,కార్తీక్,శివ,యశ్వంత్,ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :