Thursday, 30 July 2026 02:34:13 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కురబల అభివృద్ధికి సమగ్ర కృషి

విద్య, రాజకీయాల్లో ప్రోత్సాహం

Date : 17 April 2026 07:46 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల అభివృద్ధికి సమగ్ర కృషి – విద్య, రాజకీయాల్లో ప్రోత్సాహం కురబల అభ్యున్నతి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లెరెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మన్న తెలిపారు. శుక్రవారం మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 14న మదనపల్లెలో కురబ, కురమ రాష్ట్ర స్థాయి నూతన కమిటీని డివిజన్ కమిటీ తరఫున ఘనంగా సన్మానించిన సందర్భంగా సహకరించిన ప్రతి కులబాంధవులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కురబలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. కురబల శ్రేయస్సు కోసం నూతన కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలోని కురబలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదగాలని ఆశించే వారికి అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురబ విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కాంతారావు, రఘునాథ్, డివిజన్ అధ్యక్షులు కప్పల శ్రీరాములు, జనరల్ సెక్రటరీ సదాశివ, సలహాదారు రెడ్డప్ప, అడ్వకేట్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :