నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వీఆర్వో నాగరాజు ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ ఆమోదయోగ్యమన్నారు. సోమవారం నుండి ఎన్నుమరేషన్ ఫామ్ ఇస్తారని జూన్ 1 నుండి 15 వరకు జరిగే ఈ ప్రక్రియ అనంతరం జూలై 21వ తేదీ తర్వాత కొత్త ఓటరు నమోదు జరుగుతుందని తెలిపారు. జూలై 14వ తేదీ వరకు ఎటువంటి సవరణలు ఉండవని జూలై 15 తర్వాత చిరునామా ఫోటో తదితర అంశాలతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారు ఒకచోట తొలగించుకొని ఒకే చోట ఉంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కేవలం జనాభా లెక్కల్లో మాత్రమే ఉంటారని వారికి ఓటు హక్కు ఉండదని తెలిపారు. సర్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను బిఎల్ఓ లకు అందజేయాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ఉన్నారు
Reporter
Namitha News