Monday, 14 September 2026 07:35:20 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలంటూ సీపీఐ నిరసన

కూలీల కడుపులు కొట్టే విబి జి రామ్ జీ బిల్లును రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యతిరేకించాలి

Date : 22 December 2025 07:46 PM Views : 302

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - డిసెంబర్ 21 : దేశంలోని కోట్లాదిమంది కష్టజీవుల కడుపు కొట్టే విబి జి రామ్ జీ బిల్లును ఏకపక్షంగా తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్ మీద,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా, సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం బి.కొత్తకోట మండల సమితుల ఆధ్వర్యంలో, సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల తహసిల్దార్ కార్యాలయం ముందర"ధర్నా"నిర్వహించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి. నారాయణస్వామి లు మాట్లాడుతూ;వామపక్ష పార్టీల ఒత్తిడితో యూపీఏ1 ప్రభుత్వం 2005 సంవత్సరంలో పేదలకు పని హక్కు కల్పించేందుకుగానూ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చిందని,గత రెండు దశాబ్దాలుగా కోట్లాదిమంది కూలీలు అందులోనూ ఎక్కువమంది మహిళలు ఇందులో పని చేసుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు.బిజెపి ప్రభుత్వం గద్దె నెక్కినప్పటి నుండీ ఈ యొక్క చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో, ఒక పథకం ప్రకారం కుట్రలు చేసి ఈ చట్టాన్ని సవరించి ఒక పథకంగా మార్పు చేసి,వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (విబి జి రామ్ జీ) అన్న హిందీ పేరు పెట్టి మత విశ్వాసాలను ప్రేరేపించాలని మోడీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు.అదేవిధంగా ఇందులో ఖర్చులో 60 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలనే ప్రతిపాదనను చేర్చారని,పనుల ఎంపికకు గ్రామపంచాయతీలకు అధికారం లేకుండా చేసి కేంద్ర ప్రభుత్వమే ఏ పనులు చేయాలో నిర్ణయించే నిబంధనను తీసుకువచ్చారని ఆవేదన చెందారు.ఈ యొక్క బిల్లును తీసుకురావడానికి కొన్ని రోజుల ముందే దేశవ్యాప్తంగా దాదాపు 16.3 లక్షల మంది ఉపాధి కూలీల పేర్లను కేంద్రం తొలగిస్తే,అందులో 11,07,339 మంది మన రాష్ట్రానికి చెందిన కూలీలే ఉన్నా కూడా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మౌనం వహించడం చాలా దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాయడం మాని ఈ యొక్క దుర్మార్గమైన, కష్టజీవుల కడుపులు కొట్టేటువంటి,గ్రామ పంచాయతీల హక్కులను కాలరాసేటువంటి,రాష్ట్రాలపై భారాలుమోపే బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల తహసిల్దార్ బాబాజాన్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,గంగులప్ప, హబీబ్,జవహర్ బాబు, గంగన్న,శంకర,లక్ష్మన్న,షఫీ,అమీర్,రాజగోపాల్,వెంకటరమణ,గంగాద్రి,అంజి,మస్తాన్,రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: