నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు, సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీ నగరంలోని రామ్ లీలా మైదానంలో జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం 11 గంటలకు పేటీఎం రోడ్డు నందు చల్లో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా యస్.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ;దేశ ప్రజల భావోద్వేగాలతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరపకపోగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని,ఈ నేపథ్యంలో కేంద్రంలో "బద్లావ్ జరూరీ హై" "మార్పు అవసరం" అన్న నినాదంతో,కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు,దేశవ్యాప్తంగా ఈ నెల 6 నుండి 15 వరకు పాదయాత్రలు,17 నుండి 28 వరకు ప్రజాసంఘాల ఆందోళనలు నిర్వహించి,సెప్టెంబర్ ఒకటవ తేదీన "చలో ఢిల్లీ"కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.ధరల పెరుగుదలను తక్షణం అరికట్టాలని,ప్రతి యువకుడికి ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, సార్వత్రిక విద్య,ఆరోగ్యం అందుబాటులోకి తీసుకురావాలని, మహిళల రక్షణకు బలమైన చర్యలు తీసుకోవాలని, రైతన్నలకు గ్యారెంటీ మద్దతు ధర (MSP) ఇవ్వాలని,కాంట్రాక్టు, హక్కులు ఉన్న ఉద్యోగులకు భద్రత కల్పించాలని,ఓటర్ల జాబితా శుద్ధి చేసి లోకసభ ఎన్నికలు నిర్వహించాలని, దళితులు,ఆదివాసీలు, అనగారిన మైనార్టీలకు న్యాయం చేయాలని, అత్యాచారాలు,వివక్షను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ మీద ఢిల్లీలో జరిగే ర్యాలీ,బహిరంగ సభలకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం. అష్రఫ్అల్లి,ఎం.గంగులప్ప,దుమ్ము.బాబు,ఎస్. హబీబ్,నర్సింహులు,గంగాద్రి,అంజి,నరేష్,వెంకటప్ప,వెంకటమణ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News