నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : కార్వేటినగరం - ఆగస్ట్ 19 : తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు. ఆస్తి అంతస్తులు ఇవ్వలేదని తండ్రి శవానికి అంతిమసంస్కారాలు నిర్వహించుటకు, తలకొరివి పెట్టడానికి కొడుకు తిరస్కరించిన ఘటన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో వెలుగుచూసింది. తండ్రి వెంకటేశ్వర్లు మరణిస్తే డబ్బుపై ఉన్న మోజుతో కన్న పేగు బంధాన్ని తెంచేసుకున్నాడా కొడుకు. డబ్బు పిచ్చి ముందు కన్నవారి ప్రేమ ఎంత చులకనైపోయిందో అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. ఈ విషాద సమయంలో కూతురు నాగరత్నం తండ్రికి చివరి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు పూర్తిచేసింది
Reporter
Namitha News