Saturday, 12 September 2026 04:40:14 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

తంబళ్లపల్లెకు టిడిపి ఇన్చార్జిని నియమించాలి - కసెట్టి వెంకటరమణ

Date : 25 April 2026 09:48 PM Views : 255

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇంచార్జి లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక సంస్థలు ముంచుకొస్తున్న వేళ వెంటనే ఇంచార్జి నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని టిడిపి జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు కసెట్టి వెంకటరమణ, మండల బీసీ నాయకుడు పురుషోత్తం, మహిళా నాయకురాలు రామలక్ష్మమ్మ కోరారు. ఈ విషయమై టిడిపి నాయకులు, కార్యకర్తల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైకాపా పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వారి దౌర్జన్యాలు, అక్రమ కేసులు, భూ దందాలు, అన్ని రకాల దోపిడీలతో నరకం చూసామని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లెలో ఇన్చార్జి లేకపోవడంతో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో దృష్టి సారించి మీరు ఎవరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పిన శిరోధార్యంగా వ్యవహరిస్తామని వినతి పత్రంలో తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :