Sunday, 13 September 2026 11:57:22 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సంయుక్త కలెక్టర్ సమీక్ష

అభివృద్ధి కార్యక్రమాలపై ఆకట్టుకునేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలి - జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ

Date : 22 January 2026 07:20 PM Views : 391

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 22 : ఈ నెల 26న స్థానిక మదనపల్లి బెంగళూరు రోడ్డు లోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో కన్నుల పండుగగా నిర్వహించి విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లి కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలు నందు 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై డిఆర్ఓ మధుసూదన్ రావు, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిధులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సూచించారు. ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు అందరికీ పంపించాలన్నారు. పెరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కన్నుల పండుగ సాగేలా సంసిద్ధం చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీటీ కళాశాల మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని తహసీల్దార్, మునిసిపల్ కమీషనర్ లకు సూచించారు. జాతీయ జెండా ఎగరవేయుట, వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు, త్రాగునీటి ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల జారీ, ప్రోటోకాల్ మేరకు ఆహ్వాన పత్రికలు పంపిణీ తదితర అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులకు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇవ్వాలన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల నుండి వచ్చే బస్సులను, కార్లు, ఆటోలు తదితర వాహనాలను దారి మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అత్యవసర చికిత్స, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకొనే విధంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు

ఈ కార్యక్రమంలో మదనపల్లి డిఎస్పి మహేంద్ర , సర్వే ఏ.డి. భరత్ కుమార్, డ్వామా పిడి వెంకటరత్నం, డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు, డి.ఎం.హెచ్.ఓ లక్ష్మీ నరసయ్య, ఐ.సి.డి.ఎస్. పి.డి హైమావతి, వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సుభాషిని, హౌసింగ్ పిడి రమేష్ రెడ్డి, బిసి వెల్ఫేర్ అధికారి నాగేంద్ర రాజు, ఏపీ ఎస్పీడీసీఎల్, జిల్లా అగ్నిమాపక, ఆర్డబ్ల్యూఎస్ , విద్యాశాఖ, జిల్లా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, సాంఘిక సంక్షేమ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, జీఎస్టీ అధికారులు, ఇరిగేషన్ అధికారి, మదనపల్లి తాసిల్దార్, మదనపల్లి మున్సిపల్ అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: