Monday, 14 September 2026 06:54:46 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన - విబి-జి ఆర్‌ఎఎమ్‌ (జి) బిల్లు ఉపసంహరించాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు

Date : 19 December 2025 03:07 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన - విబి-జి ఆర్‌ఎఎమ్‌ (జి) బిల్లు ఉపసంహరించాలి - సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం సవరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. ఈ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం లోని గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు. చట్టబద్ద హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. యుపిఎ ప్రభుత్వంపై వామపక్షాలు తీసుకువచ్చిన ఒత్తిడి ఫలితంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టం మౌలిక స్వభావాన్ని కేంద్ర ప్రభుత్వం మారుస్తోందన్నారు. వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ (విబి-జి రాం జి) పేరుతో ఉపాధి హామీ పథకానికి ”రాంరాం” పలకనుందన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పని హక్కుగా ఉన్న పాతచట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారని తెలిపారు. సాధారణ పథకంగా దీనిని మారిస్తే, ఈ పథకం కొనసాగవచ్చు లేదా రద్దు చేయవచ్చు అని అన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ కార్మికుల డిమాండ్‌ ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్నిమార్చేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. కొత్త పథకంలో పనిదినాలు 100 నుండి 125 రోజులకు పెంచనున్నట్లు చెప్పడం ప్రజలను మభ్యపెట్టేందుకేనన్నారు. వ్యవసాయ పనులు రద్దీగా ఉండే సమయాల్లో 60 రోజుల ఉపాధిని నిలుపుదల చేయడం వల్ల అత్యంత అవసరమైన సమయాల్లో గ్రామీణ కార్మికులకు పని నిరాకరించబడుతోందని వివరించారు. తద్వారా వారిని కొద్దిమందిగా ఉండే భూస్వాములపై ఆధారపడేలా చేయడం గర్హనీయమన్నారు. యంజిఎస్‌ఆర్‌ ఈజిఎగా ఉన్న ఈ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుందని చెప్పారు. అంతేకాకుండా మరోవైపు 10 నుండి 40 శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారని వివరించారు. ఈ పథకం అమలుకు ఇప్పటివరకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారని తెలిపారు. కొత్త పథకం ప్రకారం ఖర్చును ముందుగా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత కేంద్రం తిరిగి ఆ సొమ్మును రాష్ట్రాలకు చెల్లిస్తామని చెబుతుందన్నారు. గ్రామీణీలకు మేలు చేసే పథకం పేరులో గాంధీ పేరుని తొలగించడం మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి టి. హరి శర్మ ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు ఐటియుసి నాయకులు కృష్ణమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మోహన్ రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: