నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటిలో మంత్రులు,అధికారులతో టీడీపీ నేతల భేటీ మదనపల్లె : అన్నమయ్య జిల్లా రాయచోటిలో శనివారం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజా చేరువ కార్యక్రమానికి మంత్రులు హాజరయ్యారు.ఇందులో భాగంగా రాష్ట్ర అతిథి గృహంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,జోనల్ కో-ఆర్డినేటర్ దామాచర్ల సత్య,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తదితరులను రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ అండ్ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ తో కలిసి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు.ఇందులో భాగంగా మంత్రులు వీరిని ఆప్యాయంగా పలకరించారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాగూర్ వలి (షో ఆఫ్ శీను),అయూబ్ భాష,పూస చంద్రమోహన్ రెడ్డి,బొమ్మిశెట్టి పురుషోత్తం,మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రులను శాలువాలతో ఘనంగా సత్కరించి,వారి సేవలను అభినందించారు.
Reporter
Namitha News