Saturday, 12 September 2026 02:47:17 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన యు.ఎస్.ఏ. లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు

ఉన్నత విద్యలో ఇంటర్న్ షిప్ , అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమాలు, గ్లోబల్ ఇమ్మర్షన్ లపై ఇరు యూనివర్సిటీల మధ్య ఒప్పందం

Date : 20 November 2025 07:02 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 20 : అంగళ్ళు సమీపంలో నున్న మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ను సందర్శించిన యు.ఎస్.ఏ. లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రతినిధులు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని ఒహాయో నగరం లో గల బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కె రోజర్స్, అడ్వకేట్ డాక్టర్ సాండ్ర ఎర్ల్, ప్రోవోస్టు అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి క్రోవి, వైస్ ప్రోవోస్టు ఫర్ అకడమిక్ అఫైర్స్ డాక్టర్ రామ్ వీరపనేని, డాక్టర్ వాయిల్ మోక్తర్, డీన్ - ఆర్కిటెక్చర్ అండ్ అప్లైడ్ ఇంజనీరింగ్ తదితరులు మిట్స్ యూనివర్సిటీ ను సందర్శించారు. కార్యక్రమంలో బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కె రోజర్స్ మాట్లాడుతూ బౌలింగ్ గ్రీన్ విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినదని, ఒకే కళాశాలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం, ప్రస్తుతం ఎనిమిది కళాశాలల ద్వారా 200 కంటే ఎక్కువ అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులను, మాస్టర్స్ నుండి పీహెచ్‌డీ వరకూ 75 గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోందని తెలిపారు . ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పూర్వ విద్యార్థులను, యునైటెడ్ స్టేట్స్‌లోని ఒహాయో రాష్ట్రంలో, గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ఉన్న పబ్లిక్ యూనివర్శిటీగా, ప్రజా ప్రయోజనాల కోసం సేవ చేయడమే మా యూనివర్సిటీ ముఖ్య లక్ష్యం అని ఆయన తెలిపారు . మిట్స్ డీమ్డ్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడి విద్యార్థులకు టెక్నాలజీ మరియు పరిశోధనలకు సంబంధించిన సహాయ సహకారాలు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం తరపున ఎల్లప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మాట్లాతుడుతూ బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్శిటీ నందు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ మరియు ఫార్మాస్యూటికల్ రంగాలు అత్యుత్తమ ప్రతిభను కలిగి ఉన్నాయని, ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక అపూర్వ అవకాశం అని అన్నారు. ప్రస్తుతం భారతదేశం మరియు దక్షిణాసియా ప్రాంతాలు ఏరోస్పేస్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ ప్రయాణాల విస్తరణలో వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం రెండు దేశాలకు సేవ చేసే దిశగా తమ ప్రయాణం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్శన మిట్స్ యూనివర్సిటీ మరియు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం, రెండు సంస్థల మధ్య విద్యా సహకారాన్ని పెంపొందించడం, స్టూడెంట్ ఎక్సచెంజ్ మరియు ఎం.ఎస్ వంటి ఉన్నత విద్యా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం మరియు భవిష్యత్ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేయుటకు అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఆయన అన్నారు. ఈ అవగాహన ఒప్పందం పై రెండు యూనివర్సిటీల ప్రతినిధులు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్. విజయ భాస్కర్ చౌదరి మరియు బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నీ కె రోజర్స్ సంతకాలు చేసారు. ఉన్నత విద్యలో ఇంటర్న్ షిప్ , అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమాలు మరియు గ్లోబల్ ఇమ్మర్షన్ కార్యక్రమాలను పెంపొందిచడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. విద్యార్థులకు టెక్నాలజీ రంగం లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ను పెంపొందిచేలా కృషిచేయడమే ముఖ్య లక్షమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి,. యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ట్రేనింగ్ అండ్ ప్లేసెమెంట్ హెడ్ వేణు చౌదరి, డీన్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ శ్రీమంత్ బసు మరియు సీనియర్ మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు. విజయ లక్ష్మి,వివిధ విబాగాధిపతులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :