నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... “2 ఏళ్ల నమ్మకం - సుపరిపాలన - అభివృద్ధి సంక్షేమం" పై అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం లో అత్యంత ప్రారంభమైన జిల్లా స్థాయి వేడుకలు ఈ వేడుకలలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖామాత్యులు మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మాత్యులు మరియు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు షాజహాన్ భాష, కిషోర్ కుమార్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్, నియోజకవర్గ కూటమి పార్టీ ఇంచార్జిలు, కార్యకర్తలు, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్, ప్రచార రవాణా శాఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, అన్న క్యాంటీన్, ప్రకృతి వనం తదితర శాఖల స్టాల్స్‌లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులను అభినందించారు.వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేరువైన పరిపాలన, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు తెలియజేసేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహణ
Reporter
Namitha News