Sunday, 13 September 2026 03:49:59 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

భగత్ సింగ్ కాలనీ లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ తో అణువణువూ జల్లెడ

Date : 11 April 2026 02:48 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 11: శనివారం వేకువజామున సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరు పట్టణం లోని భగత్ సింగ్ కాలనీ లో ఒక్కసారిగా ఖాకీల పహారా లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలికిడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ 'కార్డ ఆన్ సెర్చ్' ఆపరేషన్, అణువణువునూ జల్లెడ పట్టారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి, కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల అనంతరం పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి భద్రతపై భరోసా కల్పిస్తూ మీ భద్రతే మా ప్రాధాన్యత, మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెనుకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు

ఆపరేషన్‌లో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ గారితో పాటు ఎస్సైలు అన్సార్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి కార్డ్ ఆన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :