Wednesday, 29 July 2026 09:23:23 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

గోమాతల సంరక్షణే ధ్యేయంగా గోయాత్ర - స్వస్థతానంద స్వామిజీ

Date : 15 March 2026 08:16 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 15 : భారత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో భాగంగా దేశీయ గోమాతల సంరక్షణ లో భాగంగా గోయాత్ర కార్యక్రమం చేపట్టినట్లు తిరుపతి రామకృష్ణ మిషన్ సంయుక్త కార్యదర్శి స్వస్థత ఆనంద స్వామీజీ తెలిపారు.తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ కనికలమ్మ గోశాల నుండి గోపాల్స్ గో సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు రామసుబ్రహ్మణ్యం పిలుపుమేరకు ప్రతినిధి శివకుమార్ ఆధ్వర్యంలో మన పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ దేశీయ గోమాతలకు పూజలు నిర్వహించి, పూర్వపు ఎద్దుల బండ్లు తో గోశాల నిర్వాహకులు మణికంఠన్ సారథ్యంలో గోయాత్ర నిర్వహించారు. ఈగోయాత్ర మర్రిమాకులపల్లి, కన్నెమడుగు పంచాయతీలలోని మారుమూల గ్రామాలలో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గో ప్రేమికులు విశ్వమాత గోమాత, వందే గోమాతరం నినాదాలతో గోయాత్ర కొనసాగించారు. మారుమూల గ్రామాలలో మహిళలు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున గోమాతలకు పూజలు నిర్వహించి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి స్వచ్ఛదానంద స్వామి మాట్లాడుతూ స్వదేశీ గోమాతల ద్వారా గోసంరక్షణ, భూ సంరక్షణ, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో భావితరాలు ఆరోగ్యవంతంగా ఉంటారని హితోపదేశం చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువైన గోమాత సంరక్షణ పై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలని మన ప్రకృతి గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు బంగారు బాట కాగలదన్నారు. ఈ సందర్భంగా గోమాతల సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం వాటి ఉపయోగాలపై సుదీర్ఘ అవగాహన ప్రసంగం చేశారు. ఈగో యాత్రలో పల్లె ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు, గోపాల్స్ గోమాత సంరక్షణ సంస్థ ప్రతినిధులు, గో ప్రేమికులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: