Thursday, 30 July 2026 06:28:07 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎన్నికలు అవగానే చమురు ధరలు పెంచిన మోసకారి బిజెపి ప్రభుత్వం

బిజెపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్

Date : 15 May 2026 08:00 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయ్యాయో లేదో బీజేపీ అసలు రంగు బయట పెట్టిందని మదనపల్లె నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డీ సాహెబ్ పేర్కొన్నారు పెట్రోల్ రూ.3.14, డీజిల్ రూ.3.11 రూపాయల పెంచి తన దాహన్నీ తీర్చుకుందని, ఇంతటితో ఆగేటట్లు లేరని ఇది బీజేపీ చేతగాని పాలనకు, దివాళా కోరుతనానికి నిదర్శనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు,తప్పిదాలు సామాన్య, మద్యతరగతి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఇటీవల తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 పొదుపు సూత్రాలు సూచించడాన్ని తనకు తప్ప మిగిలిన వారికేనా అంటూ ఎద్దేవా చేశారు. ‌ భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రధాని ఇలాంటి సూచనలు చేయలేదని ఆf అవసరం కూడా వారికి రాలేదని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన తీరు దేశ ఆర్థిక వ్యవస్థ పై పడిందని, దాని నుంచి బయటపడడానికి దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలకు ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారని ఇది భారత ప్రధానమంత్రికి బాధ్యతారాహిత్యం అని ఇది ఇలాగే కొనసాగితే రాబోవు రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని పేద మధ్యతరగతి వర్గాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని సూచించిన వెంటనే రూ.3 రూపాయలు మేర పెంచడాన్ని తప్ప పట్టారు. పెట్రోలు, డీజిల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలు, విద్యుత్ వినియోగం పైన సూచనలు చేయడం కేవలం ఆదానికి దోచిపెట్టడానికే అని ఆరోపించారు. వంటనూనెలు పరిమితంగా వాడాలని చెప్పడం వారి చేతగాని పతనానికి నిదర్శనం అన్నారు. ప్రజలు ఏమీ తిని బ్రతకాలని నిలదీశారు.‌ మరోవైపు ఏడాది పాటు బంగారు కొనుగోలు వద్దని చెప్పడం, విడ్డూరంగా ఉందని, ఆ రంగాలలో పనిచేసే వ్యాపారస్తులు కార్మికులు ఎలా జీవించాలని... పేద, మధ్య తరగతి ప్రజలు ఇండ్లలో పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. వారి ఇండ్లలో శుభాకార్యాలు జరగడం కూడా ఇష్టం లేని విధంగా దిగుమతి సుంకం పెంచి బంగారు, వెండి ధర పెరుగుదల కారణం అయ్యారని విమర్శించారు. విదేశీ పర్యటనలు మానుకొని స్వదేశంలో మాత్రమే ప్రజలు తిరగాలని సూచించిన ప్రధానమంత్రి మీరు మరుసటి రోజే 5 దేశాల పర్యాటనలకు వెళ్ళడం ఆదర్శప్రాయం అన్నారు. ఇంకా ‌వర్క్ ఫ్రం హోమ్, జీవనశైలి మార్చుకోవాలని సూచించడం ప్రజలకేనా, మీకు లేదా అన్నారు.‌ రసాయన ఎరువులు వాడకం వద్దు, సేంద్రీయ ఎరువులు వాడాలని చెప్పే మీరు ఆదిశగా చేసిన చర్యలు ఏమిటని ప్రశ్నించారు. ‌సామన్య ప్రజలపై పెట్రోలు డీజిల్ భారం అధికంగా వుంటుందని, దాని‌ని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన పలు ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టాడానికే తప్ప సామాన్య ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు. దేశ ప్రజలందరికీ అర్థమవుతుందని, ప్రజల గమనిస్తున్నారని రాబోవు రోజుల్లో మీకు సరైన సమాధానం చెబుతారని అన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: