నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ మదనపల్లె : పట్టణంలోని గొల్లపల్లి నందు టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీం క్రేజీ బాయ్స్ నిర్వాహకులు వరుణ్ గౌడ,కార్తీక్ నాయుడు,మల్లి వారి యొక్క ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన పార్టీ యువ నాయకులు శ్రీరామ హరిహరన్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.అనంతరం ఉత్సవ నిర్వాహకులు మరియు స్థానిక యువతతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీరామ హరిహరన్ మాట్లాడుతూ హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినాలలో వినాయక చవితి పండుగ ఒకటని,పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు,అష్ట ఐశ్వర్యాలను అందించాలని ఆకాంక్షించారు.యువత ఐక్యతతో,భక్తిశ్రద్ధలతో ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉమా,నవీన్,కార్తీక్,కిషోర్,పవన్ రాయల్,దినకర్,రఫీ,వెంకీ,మహేష్,శశీ,సన్నీ మరియు జనసేన సోను,జనసేన నవాజ్,సుప్రీం హర్ష,సత్య,ప్రవీణ్,అబ్దుల్,పునీత్ చౌదరి,కుషాల్,రోహన్,కుమార్,సాయి,తేజ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News