Wednesday, 29 July 2026 09:46:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఒకటో వార్డులో వైసిపి కోటి సంతకాల సేకరణ

నిస్సార్ అహ్మద్,అనూషా రెడ్డి - ఘనస్వాగతం పలికిన కౌన్సిలర్ శ్రీనివాసులు

Date : 16 November 2025 08:28 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఒకటో వార్డులో వైసిపి కోటి సంతకాల సేకరణ - హాజరైన నిస్సార్ అహ్మద్,అనూషా రెడ్డి - ఘనస్వాగతం పలికిన కౌన్సిలర్ శ్రీనివాసులు మదనపల్లె : మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కోటి సంతకాల సేకరణ,రచ్చబండ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది.ఇందులో భాగంగా ఒకటో వార్డు,అమ్మచెరువుమిట్ట గంగమ్మ ఆలయం వద్ద వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నియోజకవర్గం పరిశీలకులు అనూషా రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరుకాగా వీరికి కౌన్సిలర్ శాలువాలు,పూలమాలలతో ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి,ఆయన తనయుడు,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారన్నారు.2019 నుండి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.గత వైసిపి ప్రభుత్వం ప్రభుత్వ విధానంలో 17 మెడికల్ కళాశాలలో తీసుకొస్తే,వాటిని పిపిపి విధానంలో కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోందన్నారు.అందుకుగాను ఎకరా భూమిని కేవలం రూ.99లకే అప్పగించడం వారి చేతకానితనానికి నిదర్శనమన్నారు.పైగా గత ప్రభుత్వంలో వైద్య కళాశాలలో నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.అవాస్తవాలు,అబద్దాలు ప్రచారం చేయడంలో కూటమి నాయకులకు మించిన వారు లేరని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.అనంతరం కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఒకటో వార్డును ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని,ఇందుకు మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా రెడ్డి సహాయ,సహకారాలు మరువలేనివన్నారు.వైసీపీ ప్రభుత్వ పాలనలో వార్డులో మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు.నిస్సార్ అహ్మద్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.అనంతరం శ్రీనివాసులు ఇంట ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి.మున్సిపల్ చైర్ పర్సన్ మనూజా రెడ్డి,వైసిపి చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు శీలం రమేష్,రేపన ముని,ఇర్ఫాన్,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,శారదా రెడ్డి,లలితా రెడ్డి,పద్మప్రియా రెడ్డి,మంజుల,వినుతా భాయి,నరసింహులు నాయుడు,చరణ్,చిన్నికృష్ణ మరియు వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: