Wednesday, 29 July 2026 04:55:43 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఖరీఫ్ సీజన్ లో రైతులకు అందుబాటులో ఉండండి - జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ

Date : 20 May 2026 08:58 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ఖరీఫ్ సీజన్లో గ్రామ వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అంతస్తు వ్యవసాయ సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ సూచించారు. బుధవారం తంబళ్లపల్లె ఆర్బికే లో ఏఈఓ లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ఆసక్తి పెంచాలన్నారు. వ్యవసాయ భూముల దుక్కి నుండి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ వరకు సచివాలయ స్థాయిలో రైతులకు వ్యవసాయం పైక్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీ ఎఫ్ ఆర్ 11 అంకెలు నమోదు, ఏపీఎంసీ యాప్ ద్వారా వ్యవసాయ సలహాలు సూచనలు అందివ్వాలని తెలిపారు. రైతులకు వ్యవసాయ పరికరాలు ఎస్సీ ఎస్టీ, సన్న కారు రైతులకు 50% సబ్సిడీ, జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో అందివ్వడానికి గడువు మరో అయిదు రోజులు పెంచిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లి సహకరించాలన్నారు. ఏపీ ఎఫ్ ఆర్ సరాసరి 3000 మంది రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ముందస్తు వ్యవసాయ సూచనలు, సలహాలు పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయన వెంట ఏవో రమణకుమార్, ఏఈఓ సురేష్, మండలంలో గ్రామ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :