నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ - మహిళలకు చీరలు పంపిణీ చేసిన పురుం సహదేవ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం,కదిరి రోడ్డులోని భారతం మైదానం నందు జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం రాత్రి ప్రదర్శించిన సాసవల చిన్నమ్మ కథ ప్రజలను రంజింపజేసింది.ఈ నాటకానికి రామారావు కాలనీ (3వార్డు)కు చెందిన చేనేత విభాగం నాయకులు పురుం సహదేవ ఆర్థిక సహకారం అందజేయడమే కాకుండా నాటకాన్ని తిలకించడానికి విచ్చేసిన మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సహదేవ మాట్లాడుతూ రోజురోజుకి కళలు అంతరించిపోతున్నాయని కావున అందరూ కళలను ప్రోత్సహించి కళాకారులను ఆదరించాలన్నారు.సాసవల చిన్నమ్మ కథలో అన్ని పాత్రలను చక్కగా ప్రదర్శించారన్నారు.సాసవల చిన్నమ్మ కథ వింటే ఎంతో పుణ్యం లభిస్తుందని,ఈ నాటక ప్రదర్శనకు తనవంతు సహకారం అందించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు.అనంతరం మహాభారతం నిర్వహకులు కొరముట్ల వెంకటేష్ (బీజేపి) మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే మహాభారత యజ్ఞానికి పురం సహదేవ తనవంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.అదేవిధంగా ధర్మరాజు పాత్ర ధరించి రక్తికట్టించారని కొనియాడారు.ఈ ఏడాది మహాభారత యజ్ఞం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని,ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం పురుం సహదేవను పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సుజాతమ్మ,గోపమ్మ,కొప్పల హరినాథ్,శంకర్ రెడ్డి,వెంకట నాగులు,యశోదమ్మ,మనోహర్,గురు ప్రసాద్,ఆదిమూర్తి,మునెప్ప కాలనీ విశ్వనాథ్,శీనా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News