నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 04 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ. స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలపై ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైకి చెందిన బైట్స్ ఇండియా కంపెనీ ఫౌండర్ & సి.ఈ.ఓ ఈ.కార్తీక్ మరియు టెక్నికల్ డైరెక్టర్ బి.సాయికిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కోర్ ప్రోగ్రామింగ్ మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాల అభివృద్ధి ఎంతో ముఖ్యమని అన్నారు. C, C++, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో బలమైన అవగాహన కలిగి ఉండటం ద్వారా విద్యార్థులు ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్నైనా సులభంగా నేర్చుకోగలరని అన్నారు. కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో లాజికల్ థింకింగ్, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం మరియు కోడింగ్ నైపుణ్యాలను ప్రధానంగా పరిశీలిస్తాయని అన్నారు. విశ్లేషణాత్మక నైపుణ్యాలు సమస్యలను చిన్న భాగాలుగా విభజించి సరైన పరిష్కారం కనుగొనే సామర్థ్యాన్ని పెంచుతాయని, టెక్నికల్ ఇంటర్వ్యూలలో కోడింగ్ దశలు మరియు అప్ట్‌టిట్యూడ్ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇవి ఎంతో అవసరమని తెలిపారు. ప్రాక్టికల్ పరిజ్ఞానం, ప్రాజెక్ట్ అనుభవం మరియు టీమ్‌వర్క్ నైపుణ్యాలు కూడా ఉద్యోగ అవకాశాలకు కీలకమని అన్నారు. అందువల్ల ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు కోడింగ్ సాధన, లాజికల్ ప్రాక్టీస్ మరియు రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, కోఆర్డినేటర్స్ డాక్టర్ జి అరుణ్ కుమార్, డాక్టర్ ఆర్.సుధాకర్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News