Tuesday, 15 September 2026 11:44:38 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తంబళ్లపల్లెలో అక్రమ లేఔట్లపై కొరడా ఝలిపిస్తాం - డి.ఎల్.పి.ఓ. నాగరాజు

Date : 14 July 2026 12:18 PM Views : 643

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 13 : తంబళ్లపల్లె లోని పంచాయతీరాజ్ చట్ట ఉల్లంఘన జరిగిన కొరడా ఝలిపిస్తామని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత కొన్నేళ్లుగా అక్రమ లేఔట్ లు వెలిసినట్లు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు ఎంపీడీవో కార్యాలయంలో తంబళ్లపల్లె పంచాయతీ అధికారులతో సమావేశం జరిపి లేఔట్ల సమస్య పై ఆరా తీశారు. అనంతరం ఆయన ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీ అధికారుల తో కలిసి లేఅవుట్లోపర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదిత లేఔట్ లో ఆట స్థలానికి, పార్కు, విద్యా సంస్థ ఏదైనా ఇతర ప్రజా ప్రయోజనానికి మొత్తం విస్తీర్ణంలో 10 శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని గుర్తించారు. పాత జడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో వేసిన 11.30 ఎకరాల భూమికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అభివృద్ధి నియమ నిబంధనలలో అతిక్రమణ జరిగిందని తెలిపారు. ఈ లేఔట్ కి సంబంధించి వెంటనే రెవిన్యూ అధికారుల నుండి రికార్డులు సేకరించి పంచాయితీ రాజ్ చట్టం అనుగుణంగా 10 శాతం భూమి పంచాయతీ కి చెందాల్సి ఉందని వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు చొరవ చూపాలని మండల పరిషత్ అధికారులు, కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట టిడిపి నాయకుడు కొండ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తోపాటు మండల సర్వేయర్ నాగరాజు,విఆర్ఓ నాగరాజు, వీఆర్ఏ ప్రసాద్, పద్మావతి, భాస్కర్ ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :