నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - సెప్టెంబర్ 15 : ఆత్మకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తమ సిబ్బందితో ఆత్మకూరు పట్టణాన్ని పూర్తిగా జల్లెడ పట్టారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో నెలకొన్న రద్దీ మరియు రేపు ఆత్మకూరు పట్టణంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో డి.ఎస్.పి వెంకటేశ్వర్లు సూచనలతో ముందస్తుగా పట్టణంలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ డిపోలోని కార్గోని సిఐ సమక్షంలో సిబ్బంది పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు పంపించారు అందులో ఏమి ఉన్నాయనే వివరాలను పరిశీలించి అనుమానం ఉన్న పార్సెల్ పై తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు..అలాగే సత్రం సెంటర్, ఆర్టీసీ డిపో, మున్సిపల్ బస్టాండ్, నెల్లూరు పాలెం తదితర రద్దీగా ఉండే ప్రాంతాలలో తనిఖీ నిర్వహించారు. పట్టణంలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు ఉన్న అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు
Reporter
Namitha News