Monday, 14 September 2026 09:29:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం

Date : 30 July 2026 07:49 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 29 : ఎలీనా ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని నీటి సంరక్షణ పనులతో భవిష్యత్తులో ఈ సమస్యను అధిగమించాలని జిల్లా డ్వామా పీడి వెంకటరత్నం సూచించారు. గురువారం ఆయన మండలంలోని ఎర్రసానిపల్లి, పంచాలమర్రి పంచాయతీలలో విబిజీ రాంజీ ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు చేపట్టిన ఫారం పాండ్స్, ఫీడర్ చానల్స్ లను తనిఖీ చేశారు. అదేవిధంగా పంచాలమర్రిలో రైతు శేఖర్ పొలంలో ఏర్పాటుచేసిన హార్టికల్చర్ మామిడి, పండ్ల తోటల పెంపకం హర్షినీయమన్నారు. రైతులు స్ఫూర్తి పొంది ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించాలని పలు సూచనలు చేశారు. మండలంలో చేపట్టిన ఉద్యానవన పంటల సాగుపై ఉపాధి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సంరక్షణ పనుల వేగవంతంతోపాటు నీటి సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలో జరుగుతున్న వీబిజి రాంజీ ఉపాధి పనులలో భాగంగా జరిగిన జలధార-జల హారతి పనులపై పంచాయతీల వారీగా అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తూ పనులు వేగవంతం తో పాటు ప్రతికూలికి పనులు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించరాదని క్షేత్ర సహాయకుల నుండి ప్రతి అధికారి నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల నిర్వహణపై కూలీలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా మొక్కలు పెంపకం తో పాటు ఫారం పాండ్స్, సాగునీటి వనరుల ఫీడర్ చానల్స్ పై దృష్టి సారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ఉషారాణి, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్,టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, క్షేత్ర సహాయకులు కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :