నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 29 : కేరళ నుంచి వచ్చి మానసిక స్థితి సరిగా లేక తప్పిపోయిన అరుణ్ ఐషాక్ (27) అనే యువకుడిని అన్నమయ్య జిల్లా పోలీసులు క్షేమంగా గుర్తించి కాపాడారు. రామాపురం ఎస్ఐ ఎ.బి. శివకుమార్, రాయచోటి అర్బన్ కానిస్టేబుల్ (PC 2872), హోంగార్డ్ (HG 725) లు నైట్ రౌండ్స్‌లో రాయచోటి పట్టణంలో గాలించి ఆ యువకుడిని రక్షించారు. స్థానిక ఉపాధ్యాయుడి సాయంతో కౌన్సిలింగ్ ఇప్పించి, సమాచారం అందుకుని రాయచోటికి చేరుకున్న తల్లిదండ్రులకు యువకుడిని సురక్షితంగా అప్పగించారు. నైట్ రౌండ్స్‌లో సమయస్ఫూర్తితో మానవతా దృక్పథాన్ని చాటిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు.
Reporter
Namitha News