నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలి - కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి విజయభారతి విద్యాసంస్థ అధినేత భవిష్యత్తులో ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులుగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణానికి చెందిన విజయభారతి విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.సేతు నియమితులయ్యారు.ఈ నేపథ్యంలో శనివారం కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి ఆయన తనయుడు పసుపులేటి శశికుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో ఎన్.సేతుకి పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ విజయభారతి విద్యాసంస్థ ద్వారా క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఎంతోమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని,అదేవిధంగా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి విద్య ప్రదాతగా నిలిచారని కొనియాడారు.అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన దిగ్విజయం చేస్తున్నారని ప్రశంసించారు.నిస్వార్ధమైన ప్రజాసేవకు సరైన నిర్వచనం చెబుతున్న డాక్టర్ ఎన్.సేతు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.పసుపులేటి చలపతితోపాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజా రెడ్డి,బీవైఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పునీత్ కుమార్,బిజెపి నాయకులు పూల నాగరాజు,సాయిశేఖర్ రెడ్డి,మాజీ వార్డు మెంబర్ నాగరాజు తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News