నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మిట్స్ వర్సిటీలో ఆధునాతన ఎం.ఎల్ పద్దతులపై అతిథి ఉపన్యాసం - హాజరైన ఐసిఎఎంఎస్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ పి.శ్వేత మదనపల్లె : మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం లాజిస్టిక్ రిగ్రెషన్ : ఆధునిక మెషిన్ లెర్నింగ్ యొక్క నిర్మాణ అంశాలు అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ బోచుమ్ ఐసిఎఎంఎస్ (ఇంటర్ డిస్సిప్లినరీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సిములేషన్) విభాగంలో మెటీరియల్స్ సైంటిస్ట్ మరియు పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి.శ్వేత హాజరై,జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది డేటాను వివిధ వర్గాలుగా గుర్తించడానికి ఉపయోగించే సులభమైన మరియు సమర్థవంతమైన మెషిన్ లెర్నింగ్ పద్ధతన్నారు.మెషిన్ లెర్నింగ్,డేటా సైన్స్,మెటీరియల్స్ ఇన్ఫర్మేటిక్స్,మోడలింగ్ మరియు సిమ్యులేషన్ వంటి ఆధునిక ఏ.ఐ వ్యవస్థల్లో మెషిన్ లెర్నింగ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.డేటాను ముందుగా సరిచేయడం,అవసరమైన సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం,మోడల్‌కు శిక్షణ ఇవ్వడం,ఫలితాలను అంచనా వేయడం,మోడల్ పనితీరును పరిశీలించడం వంటి అంశాలను విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు.లాజిస్టిక్ రిగ్రెషన్‌ను ఉపయోగించి ఈ-మెయిల్ స్పామ్ గుర్తింపు,వైద్య నిర్ధారణ,క్రెడిట్ రిస్క్ అంచనా,కస్టమర్ ప్రవర్తన విశ్లేషణ,భావ విశ్లేషణ,పారిశ్రామిక నాణ్యత నియంత్రణ వంటి అనేక వాస్తవ ప్రపంచ అనువర్తనాల్లో ఉపయోగించవచ్చని తెలిపారు.విద్యార్థులు ఏ.ఐ అండ్ ఎమ్.యల్ మరియు డేటా సైన్స్ రంగాలలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా తమ ప్రోగ్రామింగ్,డేటా అనాలిసిస్,ప్రాబ్లమ్ సాల్వింగ్,మోడల్ బిల్డింగ్ మరియు పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.విద్యార్థులు పరిశ్రమ అవసరాలతోపాటు ఉన్నత విద్య మరియు అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల దిశగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్,విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పనా,కోఆర్డినేటర్ డాక్టర్ కె.హేమలత,అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News