నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 08 : హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రామలయం సొసైటీ కాలనీ నుండి శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ అత్యంత వైభవంగా జరగనుందని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామిజీ ముఖ్య అతిధిగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె టీడీపీ పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్,ప్రభు గౌడ్, భాస్కర్ నాయుడు బీజేపీ నాయకులు శ్రీకాంత్, మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News