నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ మదనపల్లె : ఈ నెల 14న సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సర్వ విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే ఆ మహా గణపతి జిల్లా ప్రజలందరికీ పరిపూర్ణమైన ఆయుఃరారోగ్యాలను,అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు జిల్లాపై ఎల్లవేళలా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ప్రజలకు హృదయ పూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన భక్తి పూర్వకమైన పండుగ.ఆ మహాగణాధిపతి ప్రతి ఒక్కరి విఘ్నాలను తొలగించి సంతోషాన్ని,ఆనందాన్ని అందించాలని జిల్లా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అదేవిధంగా జిల్లా అన్నిరంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News