Monday, 14 September 2026 09:04:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు కెరీర్ డెవలప్మెంట్ పై అవగాహన

Date : 29 January 2026 09:28 PM Views : 233

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించేందుకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హెచ్‌సిఎల్ గువి సీనియర్ మేనేజర్ వి. లక్ష్మణ నారాయణన్ రిసోర్స్ పర్సన్‌గా హాజరై, విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఉద్యోగ అవకాశాల్లో డిగ్రీలతో పాటు కమ్యూనికేష స్కిల్స్, ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. యాదృచ్ఛికంగా స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్ దిశపై స్పష్టత, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెరుగుదల, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. “ఉద్యోగాల వెనుక పరిగెత్తకండి… నైపుణ్యాలు మరియు వాటికి ఆధారాలు నిర్మించండి — అప్పుడు ఉద్యోగాలే మీ వెనుక వస్తాయి” అని అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న సి.ఎస్.ఈ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగయోగ్యత, అలాగే ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్ ఎమ్.రాజేశ్వరి, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :