Monday, 14 September 2026 07:38:33 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీ

ఆరు పంచాయతీలు క్లీన్ చిట్ - రికవరీ లో గంగిరెడ్డిపల్లి టాప్

Date : 07 January 2026 10:43 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 07 : తంబళ్లపల్లె మండలంలో జరిగిన ఉపాధి హామీ పై జరిగిన సామాజిక తనిఖీలో రూ 78వేలు రికవరీకి జిల్లా డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పనుల పై బహిరంగ విచారణ సభ జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని 21 పంచాయతీలకు సంబంధించి జరిగిన ఉపాధి పనులపై పంచాయతీల వారీగా విచారణ జరిపారు. మండలంలో అత్యధికంగా గంగిరెడ్డిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ బిల్లులు ఉద్యోగులకు చేసి నిధులు దుర్వినియోగం జరిగినట్లు విచారణలో వెల్లడైంది.ఇందుకు సంబంధించి రూ41,834, వెయ్యి అపరాధ రుసుము పీ.డీ రికవరీకి ఆదేశించారు. పలు పంచాయతీలలో ఉపాధి హామీలో నాటిన మొక్కలు చనిపోవడంతో పీ డీ మందలించి వెంటనే మొక్కలు నాటించాలని ఆదేశించారు. ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసి సర్వర్ క్యాప్సల్ చేయాలని సూచించారు. పలు ఉపాధి పనులకు సంబంధించి రికవరీలతో బాటు అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించారు. కాగా మండలంలో ఆర్ఎన్ తాండ, కొటాల, కన్నె మడుగు, మర్రిమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి, కోటకొండ, పంచాయతీలలో ఉపాధి హామీ పనులు నిర్వహణ, బిల్లుల చెల్లింపు, మొక్కల పెంపకం తదితర అంశాలపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం పై వారిని అభినందించారు. భవిష్యత్తులో వీబిజి రాంజీ ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ధి ద్వారా నూతన ఒరవడి సృష్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి నందకుమార్ రెడ్డి, అంబుడ్స్ మెన్ శ్రీరాములు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,ఎస్ ఆర్ పి సూర్య చక్ర, తిరుమలేష్, ఏపీవో అంజనప్ప, పి ఆర్ ఏ ఈ రమణ, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, ఆయేషా,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జడ్పిటిసి రామచంద్ర, టిడిపి నాయకులు ఉత్తమ రెడ్డి, రామాంజులు, ఈసీలు మహేష్, రామన్న, టి ఏ లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :