Monday, 14 September 2026 09:52:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పేదల పాలిట ఆశాదీపం స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ - పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

Date : 29 March 2026 08:45 PM Views : 394

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 29 : నిరుపేదలకు కూడు,గూడు, గుడ్డ అందించాలని నాడు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి నేడు అణగారిన వర్గాలకు ఆశాదీపం లా నిలిచినట్లు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కొనియాడారు. ఆదివారం మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సందర్భంలో అన్న ఎన్టీఆర్ 1982 లో టిడిపిని స్థాపించి తెలుగుజాతి తలెత్తుకునేలా చేయగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో టిడిపి దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో లిఖించే స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు పార్టీ కోసం పనిచేసి భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం అండగా నిలబడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయడానికి సిద్ధం కావాలన్నారు. తంబళ్లపల్లె ఇన్చార్జి విషయం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే నాయకుడిని త్వరలో ఎంపిక చేస్తారని పార్టీ ఆదేశాలతో క్రమశిక్షణ పాటించి టిడిపి శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టిడిపి కంచుకోట తంబళ్లపల్లె లో పూర్వ వైభవానికి కార్యకర్తలకు అండగా ఉండి నా శాయశక్తులా పూర్తి సహకారం అందిస్తానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. పర్వీన్ తాజ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ఎన్టీఆర్ టిడిపి స్థాపించి నిరుపేదల పాలిట దైవంగా నిలిచారని కొనియాడారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు వర్గ విభేదాలు మరచి పార్టీ జెండా, అజెండా ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరు మండలాల సీనియర్ టిడిపి నాయకులను దృశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. తంబళ్లపల్లె మార్చి 29 ప( నమిత న్యూస్ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య) నిరుపేదలకు కూడు,గూడు, గుడ్డ అందించాలని నాడు ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి నేడు అణగారిన వర్గాలకు ఆశాదీపం లా నిలిచినట్లు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు కొనియాడారు. ఆదివారం మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన సందర్భంలో అన్న ఎన్టీఆర్ 1982 లో టిడిపిని స్థాపించి తెలుగుజాతి తలెత్తుకునేలా చేయగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో టిడిపి దేశ చరిత్ర లోనే సువర్ణ అక్షరాలతో లిఖించే స్థాయికి తీసుకెళ్లినట్లు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు పార్టీ కోసం పనిచేసి భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం అండగా నిలబడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుట ఎగరవేయడానికి సిద్ధం కావాలన్నారు. తంబళ్లపల్లె ఇన్చార్జి విషయం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకునే నాయకుడిని త్వరలో ఎంపిక చేస్తారని పార్టీ ఆదేశాలతో క్రమశిక్షణ పాటించి టిడిపి శ్రేణులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టిడిపి కంచుకోట తంబళ్లపల్లె లో పూర్వ వైభవానికి కార్యకర్తలకు అండగా ఉండి నా శాయశక్తులా పూర్తి సహకారం అందిస్తానని ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తానన్నారు. పర్వీన్ తాజ్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ఎన్టీఆర్ టిడిపి స్థాపించి నిరుపేదల పాలిట దైవంగా నిలిచారని కొనియాడారు. తంబళ్లపల్లె టిడిపి నాయకులు వర్గ విభేదాలు మరచి పార్టీ జెండా, అజెండా ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఆరు మండలాల సీనియర్ టిడిపి నాయకులను దృశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :